సంక్రాంతి

అందరం కలిసి ఉండటం సంక్రాంతి పండుగ గొప్పతనం.

అరిసెలు కలిసి చేసుకుంటారు
ముగ్గులు కలిసి వేసుకుంటారు
పంటలు పచ్చగా ఇంటికి చేరతాయి

రేగి పండ్లు, అన్ని కూరగాయలు
గోబ్బిళ్లలో సమైక్యత ను చాటుతాయి
కోళ్లు కుక్కలు మేకలు పాడి నిచ్చే గేదెలు ఆవులు వాటి చుట్టూ
తిరుగుతాయి.

ఇళ్లకు వచ్చిన కొడుకులు కోడళ్ళు
కూతుళ్లు అల్లుళ్ళు
మనవళ్ళు మనవరాళ్లు
 వీళ్ళేమిటి ఎన్ని పిలుపులు బంధాలకు ఉన్నాయో
అందరు కలుసుకునే పండుగ.


ముసలి ముతక గజ గజ వణుకుతున్న దుప్పటి ముసుగులోనే చలి మంటలో కాలిపోయిన జ్ఞాపకాలు కర్రతో వెతుక్కుంటూ 

ఇంటి ముందు గీసిన రంగుల రధం లో తమ రధం ఎప్పుడు వస్తుందో
అనుకుంటూ 

యింత సంబరాన్ని మూట కట్టుకున్న గాలిపటాలు ఆకాశం అంతా రంగులు అద్దుతూ ఉంటే 

ఆనాటి పండుగల కాలం ఏదీ? ఎక్కడ?
యే గ్రామం లో?
యే పట్టణం లో
యే దేశపు విమానాలు ఎక్కాయి?

ఒంటరి పక్షుల్లా గూట్లో గువ్వలా
ఒదిగి ఉన్నాము
ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ సంబారు బుడ్డి
ఆట లో పాద ఘట్టనలు లేవు

అంతా తారుమారు
ఎక్కడో వాళ్ళు
యిక్కడ మేము

పండగ ఆకాశంలో దూది పింజాల నడుమ
కలిసి ఉండే కాలం కోసం ఎదురు చూస్తూ.

Published on