మనుషులు మాట్లాడుకోవాలి

మౌనం మాట్లాడాలి
మనుషులు మాట్లాడుకోవాలి
అప్పుడు మాత్రమే బ్రతికున్నట్లు
మాటలు లేకపోతే మౌనమే కదా
మౌనం నిశ్శబ్దం రెండు అక్కాచెల్లెళ్ళే
అనేక యుద్దాలు అగ్నిపర్వతాలు
మౌనం లోపల జ్వలిస్తూ ఉంటాయి
విలయతాండవం సృష్టిస్తాయి
మాటలు తూటా లైనప్పుడు
మౌనంగా ఉండండి అంటారు
అప్పటి మౌనం అంతర్మధనం
మరింత మనోవికాసం కోసం
నిరంతర మౌనం స్మశానపు నిశ్శబ్దం
అక్కడ కట్టెలుకూడ శబ్దాన్ని చేదిస్తాయి
తమను తాము రుజువు చేసుకుంటాయి
మనుషుల చైతన్యం నిరంతర ప్రకాశితం
మౌనాలకు స్థానం అంటే నిర్జీవతకు రూపాలే.

Published on